వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆయన హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు వారి వెంట ఉన్నారు. ఆలయ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు ఆ జిల్లాలో.. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు రూ.76 కోట్లు, రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, సిరిసిల్లలో  రూ.26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో  రూ.కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభించనున్నారు సీఎం.

గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం అందించనున్నారు. 631 శివశక్తి మహిళా సంఘాలకు రూ.102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేయనున్నారు ఈరోజు. రూ.166 కోట్లతో వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. రూ.50 కోట్లతో  నూలు డిపో నిర్మాణ పనులు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే లు మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకుర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్, డిజిపి జితేందర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.