- ఏర్పాట్లపై కలెక్టర్ ప్రియాంక అల రివ్యూ
భద్రాచలం, వెలుగు : ఈ నెల 11న భద్రాచలం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీనిపై మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ప్రియాంక అల మీటింగ్ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ పక్కా గృహ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం భద్రాచలం రానున్నారని తెలిపారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు, గోదావరి వరదలు, కరకట్ట నిర్మాణం, మాస్టర్ ప్లాన్ తదితర వివరాలను సీఎంకు తెలిపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
బూర్గంపహాడ్, వెలుగు : ఈ నెల 11న బూర్గంపహాడ్ లో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యలు సోమవారం పరిశీలించారు. సభ నిర్వహణ కోసం లక్ష్మీపురం, బూర్గంపహాడ్, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీల్లో వివిధ స్థలాలను పరిశీలించారు. బహిరంగ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.