సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9వ తేదీ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని గతంలోనే ప్రకటించారాయన. ఈ మేరకు ఏర్పాటు చేసే స్థలాన్ని స్వయంగా పరిశీలించారు సీఎం రేవంత్.
తెలంగాణ తల్లి విగ్రహానికి.. తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని.. అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే చాలామార్లు స్పష్టం చేసిన సీఎం. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన సీఎం..
ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సచివాలయ ఆవరణను పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.