హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
  • అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
  • ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్​కు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొందరు అధికారులు హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటోళ్ల తాట తీస్తామని చెప్పారు. ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ మేరకు గురువారం సీఎంవో కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘‘అక్రమ నిర్మాణాలను చూపి బెదిరిస్తూ కొంద‌‌రు అధికారులు భారీగా వ‌‌సూళ్లు చేస్తున్నార‌‌ని మాకు కంప్లయింట్స్ ​అందాయి. గ‌‌తంలో ఇచ్చిన‌‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌‌టి ఫిర్యాదుల‌‌ను అడ్డంపెట్టుకొని కొన్నిచోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్టు మా దృష్టికి వ‌‌చ్చింది. అలాంటి వారిపై కఠిన చ‌‌ర్యలు త‌‌ప్పవు” అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాంటి అధికారులపై నిఘా పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌‌ను ఆదేశించారు.