హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారులపై కఠిన చర్యలు : సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారులపై కఠిన చర్యలు : సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా పేరు చెప్పి.. భయపెట్టి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ వస్తున్న కంప్లయింట్స్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారాయన. హైడ్రా పేరుతో నోటీసులు ఇచ్చి.. భయపెట్టి డబ్బులు వసూలు చేసే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 

గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు, మూడేళ్ల క్రితం వచ్చిన ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని.. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు సీఎం. 

ALSO READ | దుర్గం చెరువులో ఇండ్లు: సత్యం రామలింగరాజు కొడుక్కి.. దుబ్బాక ఎమ్మెల్యేకు నోటీసులు

హైడ్రా పేరుతో.. నోటీసుల పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారుల వివరాలను సైతం ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.