ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టండి... ఫాక్స్‌‌కాన్ చైర్మన్ యంగ్ లియూకు సీఎం రేవంత్​ ఆహ్వానం

ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టండి... ఫాక్స్‌‌కాన్ చైర్మన్ యంగ్ లియూకు సీఎం రేవంత్​ ఆహ్వానం
  • ఫ్యూచర్ సిటీని బహుముఖంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడి
  • ఫోర్త్ సిటీ రూపకల్పనలో సీఎం విజన్ ఆకట్టుకుంది: లియూ
  • త్వరలోనే హైదరాబాద్​ను సందర్శిస్తానని ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో రూపుదిద్దుకోనున్న ఫోర్త్ సిటీలో పెట్టుబ‌‌‌‌‌‌‌‌డులు పెట్టాల‌‌‌‌‌‌‌‌ని ఫాక్స్‌‌‌‌‌‌‌‌కాన్ చైర్మన్ యంగ్ లియూను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇక్కడ ప‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌లు పెట్టేందుకు అన్ని అనుమ‌‌‌‌‌‌‌‌తులు ఇవ్వడంతోపాటు అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మైన మ‌‌‌‌‌‌‌‌ద్దతు అంద‌‌‌‌‌‌‌‌జేస్తామ‌‌‌‌‌‌‌‌ని హామీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూనేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, ప‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌ల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైంది.

ఈ సందర్భంగా హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రానికి ఉన్న చ‌‌‌‌‌‌‌‌రిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌కు ఉన్న అనుకూల‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌, అద్భుత‌‌‌‌‌‌‌‌మైన వాతావ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ ప‌‌‌‌‌‌‌‌రిస్థితుల‌‌‌‌‌‌‌‌ను రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ బృందానికి వివ‌‌‌‌‌‌‌‌రించారు. 430 ఏండ్ల కింద పునాది రాయి ప‌‌‌‌‌‌‌‌డిన హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌ కాలక్రమంలో మూడు న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రాలుగా అభివృద్ధి చెందిన తీరును తెలియ‌‌‌‌‌‌‌‌జేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేక‌‌‌‌‌‌‌‌పోవ‌‌‌‌‌‌‌‌డంతోనే హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ వేగంగా పురోగ‌‌‌‌‌‌‌‌తి చెందుతున్నదని చెప్పారు. ఆ అభివృద్ధిని మ‌‌‌‌‌‌‌‌రింత‌‌‌‌‌‌‌‌గా ప‌‌‌‌‌‌‌‌రుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాల‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌గ్గట్టు ఫ్యూచ‌‌‌‌‌‌‌‌ర్ సిటీ పేరుతో నాలుగో న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రానికి (ఫోర్త్ సిటీ) రూప‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ల్పన చేస్తున్నామ‌‌‌‌‌‌‌‌ని వివ‌‌‌‌‌‌‌‌రించారు.

ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడా, ఎల‌‌‌‌‌‌‌‌క్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌,-ఎల‌‌‌‌‌‌‌‌క్ట్రిక‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌, స్కిల్ డెవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ప్​మెంట్​.. ఇలా బ‌‌‌‌‌‌‌‌హుముఖంగా అభివృద్ధి చేయ‌‌‌‌‌‌‌‌నున్నామ‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మైన స్కిల్స్‌‌‌‌‌‌‌‌ను యువ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌కు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ప్‌‌‌‌‌‌‌‌మెంట్ యూనివ‌‌‌‌‌‌‌‌ర్సిటీని ప్రారంభిస్తున్నామ‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. న‌‌‌‌‌‌‌‌వత‌‌‌‌‌‌‌‌రం ప‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌లకు అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మైన నైపుణ్యాలు, భ‌‌‌‌‌‌‌‌విష్యత్తులో ఆయా ప‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌ల అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రాలు తీర్చే మాన‌‌‌‌‌‌‌‌వ వ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌రుల‌‌‌‌‌‌‌‌ను అందించేందుకు సిల‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌స్ రూప‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ల్పనలో ప్రముఖ పారిశ్రామిక‌‌‌‌‌‌‌‌వేత్తలను భాగ‌‌‌‌‌‌‌‌స్వాముల‌‌‌‌‌‌‌‌ను చేస్తున్నట్టు చెప్పారు.

అందులో భాగంగానే స్కిల్ యూనివ‌‌‌‌‌‌‌‌ర్సిటీకి ఆనంద్ మహీంద్రను చైర్మన్​గా, మ‌‌‌‌‌‌‌‌రో పారిశ్రామికవేత్త శ్రీ‌‌‌‌‌‌‌‌నివాసరాజును వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నియ‌‌‌‌‌‌‌‌మించామ‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. అంత‌‌‌‌‌‌‌‌ర్జాతీయ విమానాశ్రయం, ఔట‌‌‌‌‌‌‌‌ర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్‌‌‌‌‌‌‌‌), రీజిన‌‌‌‌‌‌‌‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌)తో పాటు హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌కు ఉన్న అన్ని అనుకూల‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి వారికి వివ‌‌‌‌‌‌‌‌రించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చ‌‌‌‌‌‌‌‌ర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, సీఎం తాజా అమెరికా, ద‌‌‌‌‌‌‌‌క్షిణ కొరియా పర్యటనలు, దిగ్గజ పారిశ్రామిక సంస్థల‌‌‌‌‌‌‌‌తో జ‌‌‌‌‌‌‌‌రిపిన చ‌‌‌‌‌‌‌‌ర్చలు, చేసుకున్న ఒప్పందాల‌‌‌‌‌‌‌‌ను యంగ్​లియూకు మంత్రి శ్రీధర్​బాబు వివ‌‌‌‌‌‌‌‌రించారు.

సీఎం విజన్ ఆకట్టుకుంది: లియూ

ఇండ‌‌‌‌‌‌‌‌స్ట్రీ, స‌‌‌‌‌‌‌‌ర్వీస్ సెక్టార్లతోపాటు అన్ని రంగాల్లో విస్తరించే స‌‌‌‌‌‌‌‌త్తా హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రానికి ఉన్నదని ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్​ లియూ అన్నారు. త్వర‌‌‌‌‌‌‌‌లోనే త‌‌‌‌‌‌‌‌న బృందంతో క‌‌‌‌‌‌‌‌లిసి హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌రాన్ని సంద‌‌‌‌‌‌‌‌ర్శిస్తాన‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఫోర్త్ సిటీ రూప‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ల్పన‌‌‌‌‌‌‌‌లో సీఎం విజన్, పారిశ్రామిక అనుకూల విధానాలు త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ను ఎంత‌‌‌‌‌‌‌‌గానో ఆక‌‌‌‌‌‌‌‌ట్టుకున్నాయ‌‌‌‌‌‌‌‌ని చెప్పారు.

ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక‌‌‌‌‌‌‌‌ కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి (ఐటీ, ఎల‌‌‌‌‌‌‌‌క్ట్రానిక్స్ అండ్ క‌‌‌‌‌‌‌‌మ్యూనికేష‌‌‌‌‌‌‌‌న్స్‌‌‌‌‌‌‌‌) జ‌‌‌‌‌‌‌‌యేశ్​ రంజ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌, ప్రత్యేక కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి డాక్టర్ విష్ణువ‌‌‌‌‌‌‌‌ర్ధన్ రెడ్డి (ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రమోష‌‌‌‌‌‌‌‌న్ అండ్ ఎక్స్​ట‌‌‌‌‌‌‌‌ర్నల్ ఎంగేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌), ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి అజిత్ రెడ్డి, ఎల‌‌‌‌‌‌‌‌క్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌, సెమీ కండ‌‌‌‌‌‌‌‌క్టర్స్ అండ్ ఎన‌‌‌‌‌‌‌‌ర్జీ స్టోరేజ్ డాక్టర్ ఎస్కే శర్మ, ఫాక్స్ కాన్ నుంచి సంస్థ ఎస్బీజీ ప్రెసిడెంట్ బాబ్ చెన్, సీబీజీ జీఎం జొ వూ, చీఫ్ క్యాంప‌‌‌‌‌‌‌‌స్ ఆప‌‌‌‌‌‌‌‌రేష‌‌‌‌‌‌‌‌న్స్ ఆఫీస‌‌‌‌‌‌‌‌ర్ క్యాథీ యాంగ్, సీఎస్‌‌‌‌‌‌‌‌బీజీ డిప్యూటీ జీఎం సూ, షొ కూ, సీ- గ్రూప్ మేనేజ‌‌‌‌‌‌‌‌ర్ సైమ‌‌‌‌‌‌‌‌న్ సంగ్, సంస్థ భార‌‌‌‌‌‌‌‌త దేశ ప్రతినిధి వీ లీ త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.

నిజాయితీకి మారు పేరు కోట్ల విజ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌భాస్కర్ రెడ్డి : రేవంత్​

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌భాస్కర్ రెడ్డి నీతి,నిజాయితీల‌‌‌‌‌‌‌‌కు మారుపేరు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కోట్ల విజ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌భాస్కర్ రెడ్డి జ‌‌‌‌‌‌‌‌యంతిని పుర‌‌‌‌‌‌‌‌స్కరించుకొని ఢిల్లీలోని త‌‌‌‌‌‌‌‌న అధికారిక నివాసంలో రేవంత్​ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కోట్ల విజయభాస్కర్​రెడ్డి సేవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను ఆయన స్మరించుకున్నారు.