మధ్యప్రదేశ్ వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి

మధ్యప్రదేశ్ వెళ్లిన సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డి ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్​ కు వెళ్లారు. సంవిధాన్​ పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్​లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నగర్​లో నిర్వహించనుంది. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్​పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్​ వీటిని చేపడుతున్నది.