నవంబర్ 12న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి  మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ మీడియా సంస్థ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం. ఇది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగతమైందని తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేతలు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల బిజీలో ఉండడంతో రేవంత్ ఈ టూర్ లో పార్టీ పెద్దలను ఎవరినీ కలిసే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.