
హైదరాబాద్, వెలుగు: జనవరి 26 నుంచి అమలు చేయబోతున్న పథకాలపై సంబంధిత మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రేషన్ కార్డులపై గందరోగళం, గ్రామసభల నిర్వహణ, వ్యవసాయ యోగ్యంకానీ భూముల గుర్తింపు ప్రక్రియ, భూమిలేని రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇండ్లలో మొదటి విడత లబ్ధిదారుల లిస్ట్ వంటి వాటిపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రివ్యూ చేయనున్నారు.
ముగిసిన గ్రామ సభలు
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారంతో 16,348 గ్రామ, వార్డుసభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. 4 రోజుల పాటు జరిగిన గ్రామసభలకు ప్రజలు భారీగా హాజరై నాలుగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు అందజేశారని అధికారులు తెలిపారు.