మహారాష్ట్రకు సీఎం, మలేషియాకు పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు.  తెలంగాణ వారు అధికంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో  కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.   శుక్రవారం రాత్రి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, విప్ బీర్ల ఐలయ్య

 సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి మలేషియాకు బయలుదేరారు. మలేషియా తెలంగాణ అసోషియేషన్ ఆహ్వానం మేరకు   తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. వీరు సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.