నేడు సిరిసిల్ల, జగిత్యాలకు సీఎం రాక

నేడు సిరిసిల్ల, జగిత్యాలకు సీఎం రాక

జగిత్యాల/రాజన్నసిరిసిల్ల, వెలుగు :  నేడు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పర్యటించనున్నారు. సీఎం రాక సందర్భంగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం పరిశీలించారు. కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్న

నేపథ్యంలో శుక్రవారం జరగబోయే జనజాతరసభకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ, సభా స్థలంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిగి తెలుసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఎస్పీ సత్ ప్రీత్ సింగ్ సంబంధిత ఆఫీసర్ల కు సూచించారు.  సిరిసిల్ల బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

సిరిసిల్లకు 8న మోదీ, 10న కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

రాజన్నసిరిసిల్ల జిల్లాకు అగ్రనాయకులు తరలిరానున్నారు. శుక్రవారం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వస్తుండగా, 8న ప్రధాని మోదీ, 10న మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రానున్నారు. బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతుగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరిసిల్లలో రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక్కడే నాలుగు రోజులుగా సిరిసిల్లలో మకాం వేసి, వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు.