SLBC టన్నెల్‎ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

SLBC టన్నెల్‎ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఎస్‎ఎల్‎బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఆదివారం (మార్చి 2) వనపర్తి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు ప్రమాదానికి గురైన ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్లనున్నారు. వనపర్తి సభ అనంతరం హెలికాప్టర్లో దోమలపెంటకు వెళ్లనున్న సీఎం.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్ఎల్‎బీసీ టన్నెల్‎కు చేరుకోనున్నారు. టన్నెల్ వద్ద జరుగుతోన్న సహయక చర్యలను సీఎం పరిశీలించనున్నారు. రెస్య్కూ ఆపరేషన్‎పై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో టన్నెల్ వద్ద భద్రత ఏర్పాటు చేయనున్నారు. 

కాగా, నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద ఎస్ఎల్‎బీసీ టన్నెల్‎లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. టన్నెల్ పై కప్పు కూలడంతో అందులో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులను రక్షించేందుకు 9 రోజులుగా టన్నెల్‎లో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. సహయక బృందాలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. 

టన్నెల్‎లో బురద, నీళ్లు ఉబకడంతో రెస్య్కూ ఆపరేషన్ సవాల్‎గా మారింది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గర జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీమ్ మరికొన్ని గంటల్లో 4 మృతదేహాలు వెలికితీయనున్నట్లు సమాచారం. ఇప్పటికే టన్నెల్ వద్ద ఫోరెన్సిక్, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మృతులను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‎ లు కూడా సిద్ధం చేశారు అధికారులు.