- సీఎం రేవంత్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: టీచర్లందరికి సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని చెప్పారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బాధ్యత చాలా గొప్పదని సీఎం అన్నారు.
దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో అధ్యాపకులది కీలక పాత్ర అని, అటువంటి గురువులను ప్రజా ప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తోందని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో ఉపాధ్యాయ సమాజం విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.