ఆదివాసీలు అడవికి తోడుండే భూమిపుత్రులు : సీఎం రేవంత్ రెడ్డి

ఆదివాసీలు అడవికి తోడుండే భూమిపుత్రులు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజనులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మూలవాసులుగా, అమ్మలాంటి అడవికి తోడుండే భూమిపుత్రులుగా, కల్మశం లేని అనుబంధాలకు ప్రతీకలుగా ఆదివాసీలు నిలుస్తారని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రూ.17,056 కోట్ల కేటాయింపుతో బడ్జెట్ లో గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. గతంలో  పంచాయతీలుగా మారినా పైసా నిధులు లేక నిర్లక్ష్యానికి గురైన గిరిజన గూడేల్లో రోడ్లు, విద్యుత్, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం సంకల్పించిందని  సీఎం వెల్లడించారు.