సీఎం యాదాద్రి టూర్లో ప్రోటోకాల్ వివాదం.. పోలీసులు వర్సెస్ కాంగ్రెస్ నాయకులు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్ ప్రోగ్రాంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో హాజరయ్యేందుకు తమ పేర్లు ఉన్న ఆలయం లోపలికి అనుమతించడం లేదని కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం జిందాబాద్, పోలీస్ జూలూమ్ నశించాలి అని నినాదాలు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 

అంతకుముందు శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 2024 మార్చి 11 సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు యాదాద్రి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.  సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్టకు రాడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

ALSO READ :- David Miller: ప్రేయసిని పెళ్లాడిన డేవిడ్ మిల్లర్.. ఫోటోలు వైరల్