సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం టూర్ ఖరారు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం టూర్ ఖరారైంది.  సీఎం టూర్,  ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం తదితర అంశాలపై మార్చి 09న  జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్, ఎస్పీ రోహిత్, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2024 మార్చి 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,  మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి  భద్రాచలంలో పర్యటించనున్నారని తెలిపారు.

ALSO READ :- మానేరులో నీళ్లు ఉన్నాయ్.. మేం తోడేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తుండ్రు..

ఉదయం ముందుగా సీఎం రేవంత్  భద్రాచల సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని, మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన  జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మూడు వేలమంది  ప్రజల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభిస్తారు.  ఆ తరువాత  భోజనం ఉంటుంది. భోజనం అనంతరం మణుగూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  సీఎం పాల్గొని ప్రసంగిస్తారు.