సిటీనెట్వర్క్, వెలుగు : గ్రేటర్లో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తార్నాకలోని తన ఆఫీసులో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి కేక్‌కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మూసీ బ్యూటిఫికేషన్చారిత్రక నిర్ణయమన్నారు. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్ లాల్, ప్రవీణ్ సనత్ నగర్ కాంగ్రెస్ ఆఫీసులో నియోజకవర్గ ఇన్చార్జ్డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో సీఎం బర్త్‌డే నిర్వహించారు.
అమీర్‌పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్లో చిన్నారులకు ఆటలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫొటోలతో పజిల్స్పోటీలు నిర్వహించారు. బాచుపల్లి కాంగ్రెస్ ఆఫీసులో సీఎం బర్త్‌డే నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ధమ్మని శ్రవణ్ కుమార్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, మెట్రో రైల్‌ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
మెదక్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బర్త్‌డే విషెస్ తెలిపారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు వేర్వేరు చోట్ల సీఎం బర్త్‌డే నిర్వహించారు. ఫుట్‌పాత్‌లపై ఉంటున్నవారికి దుప్పట్లు పంపిణీ, హాస్పిటళ్లలోని పేషెంట్లకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ తన రక్తంతో రేవంత్ ఫొటోను గీయించి అభిమానాన్ని చాటుకున్నాడు.