ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సీఎం బర్త్ డే వేడుకలు

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి పుట్టి న రోజు వేడుకలను శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారథ్యంలో  ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. 

కార్యక్రమంలో టెక్నికల్ ఆఫీసర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.