మెదక్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్ మెదక్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో 50 అడుగుల వెడల్పుతో రంగులతో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి చిత్ర పటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రంగోలి చిత్రకారుడు పురుషోత్తం తన టీం మెంబర్స్‌తో కలిసి దాదాపు 20 గంటలు శ్రమించి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ ప్రసిడెంట్ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణేశ్ రెడ్డి, వీరేశం, కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ, రాజేశ్, సుభాష్ చంద్రబోస్, టౌన్ ప్రెసిడెంట్ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు, నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట టౌన్: జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పూజల హరికృష్ణ, నాయకులు రఘువర్ధన్ రెడ్డి, దరిపల్లి చంద్రం కలిసి సీఎం బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కౌన్సిలర్ సాకి బాల్ లక్ష్మీ ఆనంద్ సారధ్యంలో మున్సిపల్ కార్మికులకు, వార్డు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నరుకుల శివప్ప, శ్రీను, అత్తు ఇమామ్, మహేందర్, ఎల్లం, యాదగిరి, రాజ్ బహదూర్ రెడ్డి పాల్గొన్నారు.
కొమురవెల్లి మండల కేంద్రంలో జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పాఠశాల స్టూడెంట్స్‌కు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ రాజగోపురం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్, కనకరాజు, నర్సింలు, లింగం, మహేశ్, వంశీకృష్ణ, రాజు, కిరణ్, నవీన్ పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో..
నారాయణ్ ఖేడ్: సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే వేడుకలను ఖేడ్పట్టణంలో ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించి సంబరాలు జరిపారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.