- చామలకు ఎంపీ టికెట్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్ అలక
- విషయం తెలిసి స్వయంగా రాజగోపాల్‌రెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి
- అక్కడే భువనగిరి పార్లమెంట్నియోజకవర్గ సమావేశం
- గెలుపు బాధ్యత రాజగోపాల్‌రెడ్డికే అప్పగిస్తూ నిర్ణయం
- కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
యాదాద్రి, వెలుగు: భువనగిరి లోక్‌సభ స్థానంలో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్‌పెట్టారు. ఈ సీటును తన అనుచరుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి కేటాయించడంపై నల్గొండ జిల్లాలోని కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. దీంతో క్యాడర్అయోమయంలో పడిపోయింది. తాజాగా, సీఎం రేవంత్ ఈ విషయానికి చెక్‌పెట్టారు. ఈ సీటులో విజయం కోసం తాను ఒక మెట్టు దిగివచ్చారు. బుధవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే భువనగిరి పార్లమెంట్ రివ్యూ మీటింగ్ నిర్వహించి, చామల గెలుపు బాధ్యతను రాజగోపాల్‌రెడ్డికే అప్పగించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
కోమటిరెడ్డి ఫ్యామిలీని కాదని..
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ఢిల్లీ వేదికగా తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య జరిగింది. ఈ పార్లమెంట్‌స్థానం ఏర్పడిన 2009 నుంచి ఇక్కడ కోమటిరెడ్డి ఫ్యామిలీ సభ్యులే మూడుసార్లు పోటీ చేసి, రెండుసార్లు గెలుపొందారు. ఈసారి కూడా ఆ కుటుంబం నుంచే అభ్యర్థి ఉంటారని ప్రచారం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించనందున ఆయన భార్య లక్ష్మికి ఈ టికెట్కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి కుటుంబానికే చెందిన సూర్య పవన్‌రెడ్డి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. సూర్య పవన్‌రెడ్డి తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని, కోమటిరెడ్డి లక్ష్మి తరఫున రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. అదే సమయంలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని రాజగోపాల్‌రెడ్డి కామెంట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అభ్యర్థి ఎంపికలో సీఎం రేవంత్చక్రం తిప్పారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అలకబూనినట్టు ప్రచారం మొదలైంది.
మెట్టు దిగిన రేవంత్
చామల గెలవాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం ఉండాలి. దీంతో రేవంత్ సూచనల మేరకు అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కలిశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భువనగిరి లోక్‌సభ ఇన్చార్జిగా హైకమాండ్ ప్రకటించింది. కానీ ప్రచారంలో రాజగోపాల్అడుగు ముందుకు పడలేదు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఒక మెట్టు దిగారు. లోక్‌సభ నియోజవర్గాల్లో గెలుపు కోసం తన ఇంట్లో వరుసగా రివ్యూలు చేస్తున్న సీఎం.. భువనగిరి లోక్‌సభ రివ్యూను మాత్రం జూబ్లీహిల్స్‌లోని రాజగోపాల్‌రెడ్డి ఇంట్లో నిర్వహించారు. రివ్యూ అనంతరం భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు బాధ్యతను రాజగోపాల్‌రెడ్డికే అప్పగించారు. ఈ నెల 12 నుంచి భువనగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని మీటింగ్‌లో నిర్ణయించారు. ఈ నెల 21న అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనుండగా.. అదే రోజు భువనగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. మే మొదటి వారంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, చౌటుప్పల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.