- నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్‌నాయకుల భారీ ర్యాలీలు, నిరసనలు
- ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: బోథ్నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీ వివాదం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఆ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్నియోజకవర్గ ఇన్చార్జిఆడె గజేందర్పిలుపుమేరకు శనివారం నియోజకవర్గంలోని బోథ్, బజార్హత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్, సిరికొండ, తలమడుగు, తాంసి మండలాల్లో కాంగ్రెస్నాయకులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ దిష్టిబొమ్మలతో ర్యాలీలు నిర్వహించి దహనం చేశారు. పలు చోట్ల పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారికి, నాయకులకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఆదిపత్యం కోసం కాకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని ఎమ్మెల్యేకు హితవు పలికారు. మార్కెట్చైర్మన్బొడ్డు గంగారెడ్డి, గోక గణేశ్‌రెడ్డి, ప్రఫుల్చందర్రెడ్డి, పోతారెడ్డి, క్రాంతి, పోతన్న, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని ఓర్వలేక నీచ రాజకీయాలు
నేరడిగొండ: బోథ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను చింపేయడంపై నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆడే గజేందర్ మండిపడ్డారు. నేరడిగొండ మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ.. సీఎం ఫ్లెక్సీలను చింపడం దౌర్జన్యం అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ అహంకారంతో రౌడీయిజం చేస్తున్నారని, కాంగ్రెస్‌కు చెందిన ఫ్లెక్సీలు చింపేయడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్అయ్యారు.