ఎందుకు నాపై కోపం.. రుణమాఫీ చేసినందుకా.. ఫ్రీ బస్ అమలు చేస్తున్నందుకా..? CM రేవంత్

ఎందుకు నాపై కోపం.. రుణమాఫీ చేసినందుకా.. ఫ్రీ బస్ అమలు చేస్తున్నందుకా..? CM రేవంత్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, సీఎంపై ప్రజలు కోపంతో ఉన్నారని ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం (మార్చి 20) హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నా మీద వ్యతిరేకత, కోపం ఉందని కొందరు అంటున్నారు.. రైతు రుణ మాఫీ చేసినందుకు నాపై కోపంగా ఉన్నారా..? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు కోపంగా ఉన్నారా..? మహిళలను కోటిశ్వరులను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు కోపంగా ఉన్నారా..? 59 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపంగా ఉన్నారా..? దేనికి ప్రజలు నాపై కోపంగా ఉంటారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 

ALSO READ | నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే BRS ఓటమి: సీఎం రేవంత్ రెడ్డి

అలాగే.. రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు రాలేదంటూ వస్తోన్న విమర్శలపైన ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారు. రాజయ్యను కారణం లేకుండా మంత్రి పదవి నుంచి తొలగిస్తే పట్టు వచ్చినట్టా..? సచివాలయానికి రోజు వెళ్లకపోతే పట్టు వచ్చినట్టా అని ప్రశ్నించారు. ఏమి తెలియకుండానే ఈ స్థాయికి వచ్చానంటారా..? నల్లమల్ల నుంచి వచ్చా.. మానవ మృగాలు ఎలా ఉంటాయో నాకు తెలియదా అని హాట్ కామెంట్స్ చేశారు. 

కాకపోతే సీఎం అనేటోడికి విజ్ఞత ఉండాలని.. అందుకే నేను విజ్ఞతతో ప్రవర్తిస్తున్నానని అన్నారు. అందుకే ఇవాళ సామాన్యుడు కూడా సెక్రటేరియట్‎కు వస్తున్నారన్నారు. నేను ఆదేశాలు ఇస్తే కేటీఆర్ ఈపులు పగొలగొట్టరా..? కోదండరామ్ ఇంటి తలుపులు పగలగొట్టినోళ్లు కేటీఆర్ ఇంటి తలుపులు పగలకొట్టడం ఎంతసేపు.. వాళ్లలాగే మేం అణిచివేయాలనుకుంటే ఎంతసేపు అని హాట్ కామెంట్స్ చేశారు.