హైదరాబాద్: ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఆయన కీలక ప్రకటన చేశారు. 2025, జనవరి 26వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు లేని వారందరికి కొత్త కార్డులు జారీ చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం (జనవరి 4) రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
Also Read : భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా రూ. 12 వేలు
భేటీ ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రకటన చేశారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. కాగా, ప్రజా పాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే.