దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలు పెడితే ఊరుకోం.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే: CM రేవంత్ వార్నింగ్

దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలు పెడితే ఊరుకోం.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే: CM రేవంత్ వార్నింగ్

హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాల్లో ఇటీవల జరుగుతోన్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‎లోని ఎల్బీ  స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వరంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ‘‘ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నా. విద్యార్థులు తినే ఆహారంలో కల్తీ జరుగుతోంది. విద్యార్థులు తినే భోజనంలో పురుగులు, బల్లులు వస్తున్నాయి. 

ఇక నుండి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టకపోతే జైలుకు పంపుతాం. విద్యార్థులకు గ్రీన్ ఛానెల్ ద్వారా కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలి. విద్యార్థులకు సన్నబియ్యంతో మంచి ఆహారం పెట్టాలి. ముఖ్యమంత్రి, మంత్రులు తినే సన్న బియ్యమే గురుకులాల విద్యార్థులకు భోజనం పెడుతున్నాం. ఎక్కడైనా విద్యార్థులకు దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడితే ఊరుకోం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

ALSO READ | ప్రమాణం చేయండి: చిల్డ్రన్స్ డే వేళ విద్యార్థులకు CM రేవంత్ కీలక పిలుపు

 రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని.. ఈ విద్యార్థులే రాష్ట్ర భవిష్యత్ అన్నారు. ఇందులోనే కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు, ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. గతంలో ముఖ్యమంత్రిని ఏనాడైనా మీరు చూశారా..?  ఎల్బీ స్టేడియానికి తీసుకువచ్చి మీతో మాట్లాడారా..? ఈ వేదికగా మీ కళల్ని ప్రదర్శించే అవకాశం నాడు ఇచ్చారా..? కానీ మీ రేవంత్ అన్న మిమ్మల్ని కలుసుకున్నాడు.. మీతో ఉన్నాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హోస్‏లో పడుకున్న కేసీఆర్‎కు వినపడేలా విద్యార్థులు చప్పట్లు కొట్టాలని ఈ సందర్భంగా స్టూడెంట్స్‎కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పండగ పేరుతో సారా బుడ్లతో దొరికిన వారికి శిక్ష తప్పదని పరోక్షంగా కేటీఆర్‎ను హెచ్చరించారు.