ముంబైలో సీఎం రేవంత్ రోడ్ షో

  • శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య థాక్రే తరఫున ప్రచారం 

హైదరాబాద్, వెలుగు:  మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన‌ర్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. ముంబైలోని కీల‌క స్థాన‌మైన వ‌ర్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే కొడుకు మాజీ మంత్రి ఆదిత్య థాక్రే పోటీ చేస్తున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినందున ఆదిత్య థాక్రే తరఫున సీఎం రేవంత్ బుధవారం రోడ్ షో నిర్వహించారు.

రోడ్ షోకు ముందుగా వర్లీలోని బాలాజీ ఆల‌యంలో ఆయన పూజ‌లు చేశారు. ముఖ్యమంత్రి రోడ్ షోకు ముంబై ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. రోడ్డుకు ఇరువైపులా రేవంత్ ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రోడ్ షోలో సీఎం రేవంత్ తోపాటు ఆదిత్య థాక్రే, ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్ వర్ష గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.