కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ వెళ్లనున్నారు. 2024 ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం 10:15 గంటలకు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ నుంచి బయల్దేరుతారు. భువనగిరి, జనగామ, హనుమకొండ మీదుగా జయశంకర్భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 3.30 గంటల నుండి 5 గంటల మధ్యలో మేడిగడ్డలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పిల్లర్లతో పాటు మొత్తం బ్యారేజీని పరిశీలిస్తారు. అనంతరం అక్కడే ఇరిగేషన్అధికారులు, ఇంజనీర్లతో రివ్యూ చేస్తారు. ఇంజనీర్లు బ్యారేజీ కుంగుబాటుపై ప్రజంటేషన్ఇస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సీఎం, మంత్రులు మీడియాతో మాట్లాడతారు. అనంతరం అందరూ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. రాత్రి 8.30 గంటలకు పరకాలలో హోటల్ లో డిన్నర్ చేస్తారు. 9.30 గంటలకు పరకాల నుండి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు.
మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రావాలని ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. ఈ పర్యటనకు రావాలని కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారు. కాగా, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్ఎస్ పార్టీ మంగళవారం ‘చలో నల్గొండ’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ మేడిగడ్డ పర్యటనకు వెళ్లడం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు.