వరద బాధితులకు రూ. 10 వేల తక్షణ సాయం: సీఎం రేవంత్

వరద బాధితులకు  రూ. 10 వేల తక్షణ సాయం: సీఎం రేవంత్

వరదలకు నష్టపోయిన ప్రతీ కుటుంబానికి తక్షణమే  రూ.10 వేల తక్షణ సాయం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటించారు రేవంత్. పోలేపల్లిలో వరద బాధితులను పరామర్శించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్..మున్నేరు వరద వందలాది కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు. వరదలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఇంటింటికి తిరిగి నిత్యవసర సరుకులు ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు సీఎం.  అధికారులు ఇంటింటికి తిరిగి  నష్టం అంచనా వేస్తారని చెప్పారు.  

 కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు అండగా నిలవాలని సూచించారు సీఎం రేవంత్.  రూ.650 కోట్లతో మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని చెప్పారు.  ప్రాణ నష్టం వాటిల్లిన కుటుంబానికి  రూ.5 లక్షలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. మిమ్మల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కదిలివచ్చిందన్నారు. నష్టపోయిన బాధితులను సంపూర్ణంగా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదన్నారు రేవంత్.