
కులగణన నూటికి నూరు శాతం పక్కా అని సీఎం రేవంత్ అన్నారు. కులగణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీ సంఘాలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. కులగణనలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలువబోతుందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. సర్వే తప్పు అయితే..ఎట్ల తప్పో చూపించాలని బీజేపీ,బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు రేవంత్. కుట్రలో భాగంగానే బీజేపీ,బీఆర్ఎస్ కులగణన సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్. కులగణన లెక్కలు తప్పు కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి కులగణన లెక్క పక్కా అని మార్చి 10 లోగా తీర్మానం చేయాలని సూచించారు.
Also Read :- మంత్రుల వ్యాఖ్యలతో ప్రజల్లో మొదలైన టెన్షన్
రేవంత్ కామెంట్స్
- కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతది
- ప్రజాభవన్లో బీసీ సంఘాలు కులణనపై చర్చ
- బీసీ రిజర్వేషన్లు,42 శాతం రిజర్వేషన్లపై చర్చ
- రాహుల్ మాట ప్రకారమే కులగణన చేశాం
- అన్ని రాష్ట్రాల్లో స్టడీ చేశాకే కులగణన చేశాం
- గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదు
- ప్రతి ఇంటింటికి తిరిగ పక్కాగా కలగణన చేశాం
- మంత్రి వర్గ ఉపసంఘం సూచన మేరకు సర్వే చేశాం
- స్వాతంత్ర్యం వచ్చాక ఇంత వరకు బీసీ గణన చేయలేదు
- సమగ్ర కుటుంబ సర్వే తో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారు
- సమగ్ర కుటుంబ సర్వే వివరాలు రిలీజ్ చేయలేదు
- 150 ఇళ్లను క్లస్టర్ గా సర్వే చేశారు
- 160 కోట్లతో 50 రోజులు సర్వే చేశాం
- సర్వే అయ్యాక ఇంటి యజమాని సంతకం తీసుకున్నాం
- పగడ్భందీగా సర్వే చేశాం
- కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అంతా తప్పుల తడక
- తప్పుల సర్వేతో ఎస్సీ,ఎస్టీ కులాలు 82గా మారాయి
- పరువు పోతదని సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టలేదు
- సర్వే తప్పు అన్న వారు వచ్చి తప్పులు చూపించండి
- కోటి 12లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి
- 3 కోట్ల54 లక్షల 74 వేల మంది సర్వేలో పాల్గొన్నారు
- ప్రధాని సహా ఎంత పెద్ద నాయకులు ఉన్నా సర్వేలు చేయలేదు
- 2011లో కాంగ్రెస్ చేసిన లెక్కలను బయటపెట్టాలి
- బీసీ లెక్కలు ఓవర్ నైట్ రాలేదు..ఎన్నో ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు
- ఒక్కసారి లెక్కలు తేలితే ఎవరి వాటా వాళ్లు అడుగుతారు
- ఏది ఓవర్ నైట్ జరిగిపోదు, కొట్లాడి కొట్లాడి సాధించుకోవాలి
- సర్వే బీజేపీ నాయకులకు గుది బండగా మారుతుంది
- రెండో విడత కూడా కులగణనకు అవకాశం ఇచ్చాం
- ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సర్వేకు అవకాశం ఇచ్చాం
- సర్వేకు అందుబాటులో లేకపోతే ఆన్ లైన్లో,టో ల్ ఫ్రీ నంబర్లు పెట్టిన అవకాశం ఇచ్చాం
- కేసీఆర్ కుటుంబం సర్వేలో ఎందుకు పాల్గొనలేదు
- కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం
- 51 శాతం బీసీలు.
- 21 శాతం ఓసీలు
- 18 ఎస్సీలు
- 10 ఎస్టీలు
- కేసీఆర్ ఇచ్చిన క్యాటగీరీలో మైనార్టీలు లేరు
- కేసీఆర్ నాలుగు క్యాటగిరీలు ఇస్తే..మేం ఐదు క్యాటగిరీలు ఇచ్చాం
- కేసీఆర్ చెప్పిన 51 శాతం ఎక్కువా?నేను ఇచ్చిన 56 శాతం ఎక్కువా.?
- బీసీ లెక్కలు కేసీఆర్ తగ్గిస్తే నేను పెంచిన
- ఓసీలు తగ్గారు..బీసీలు పెరిగారు
- గుజరాత్ లో 70 ముస్లీం జాతులను బీసీల్లో చేర్చినా..కానీ మీడియాకు చెప్పలేదని 2002లో మోదీ చెప్పారు
- కులగణన సర్వే లెక్క నూటికి నూరు శాతం పక్కా..
- నాపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలుసు
- సర్వేను బీజేపీ తప్పుబడుతోంది
- దేశమంతా కులగణన చేయాల్సి వస్తుందని బీజేపీ భయపడుతోంది
- సర్వే పక్కాగా చేశాం..దేశంలో తెలంగాణ రోల్ మోడల్
- దేశ వ్యాప్తంగా కులగణన చేయాల్సి వస్తదని మోదీ భయపడుతున్నాడు
- బీసీల లెక్క తప్పైతే..ఎక్కడ తప్పో బీజేపీ,బీఆర్ఎస్ చూపించాలి నేను సవాల్ చేస్తున్న
- కుట్రలో భాగంగానే కులణన తప్పు అంటున్నారు
- నేను చేయాల్సింది చేశా..సైలెంట్ గా ఉంటే బీసీలకే నష్టం
- బీసీల లెక్క తప్పుకాదని జనంలోకి తీసుకెళ్లండి
- చరిత్రలో నిలిచిపోయేది కులగణన
- సర్వే రాహుల్ గాంధీ..మనకు ఇచ్చిన ఆస్తి
- దాన్ని మీరు కాపాడుకోకపోతే మీకే నష్టం..కట్టె పట్టుకుని కాపాడుకోండి
- హరీశ్ రావు, కేసీఆర్ ,కేటీఆర్ జనాభా లెక్కల్లో లేరు
- కులగణన రాహుల్ గాంధీ ఎక్స్ రే అన్నారు కానీ..నేను మెగా హెల్త్ చెకప్ అని అంటున్న
- కులగణన బలహీన వర్గాల భావోద్వేగం..వాళ్లకు ఇదే భగవద్గీత, ఖురాన్