దేశం కోసం సర్వం త్యాగం చేసిన చరిత్ర వాళ్లది.. వేల కోట్లు దోచుకున్న చరిత్ర వీళ్లది: రేవంత్

దేశం కోసం సర్వం త్యాగం చేసిన చరిత్ర వాళ్లది.. వేల కోట్లు దోచుకున్న చరిత్ర  వీళ్లది: రేవంత్

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో  చూస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ లో రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు పదేళ్లు ఎందుకు పట్టిందని కేసీఆర్ ను  ప్రశ్నించారు రేవంత్.. కేసీఆర్ తన విగ్రహాన్ని పెట్టుకుందామని ఖాళీ స్థలం ఉంచుకున్నారని చెప్పారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని చెప్పారు రేవంత్. త్యాగం అంటే రాజీవ్ గాంధీ ఫ్యామిలీదన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన చరిత్ర రాజీవ్ ఫ్యామిలీదన్నారు రేవంత్. 

ALSO READ | సెక్రటేరియట్ ముందు.. రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

దేశానికి కంప్యూటర్లు  పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని చెప్పారు రేవంత్.  సాంకేతిక విప్లవంతోనే ఈ రోజులు ప్రపంచంతో  పోటీ పడుతున్నామన్నారు.  రాజీవ్ లేకుంటే కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యేవాడా? అని ప్రశ్నించారు.  కంప్యూటర్లు రాకుంటే సిద్దిపేటలో ఇడ్లీ వడ అమ్ముకునే వాళ్లు..   ఎక్స్ లో ట్వీట్లు చేసే వాళ్లు ఈ విషయం గుర్తు  పెట్టుకోవాలని ధ్వజమెత్తారు రేవంత్. కేటీఆర్ బలుపు మాటలు కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలన్నారు.  వాళ్ల గడీల్లో గడ్డిమొలిచేలా చేశా.. ఫామ్ హౌస్ లల్లో  జిల్లేళ్లు మొలిచేలా చేస్తానని సవాల్ విసిరారు. రాజకీయంగా దివాళ తీసిన వాళ్లు కొందరు చిల్లరగాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మిడతల దండును పొలిమెర వరకు తరిమి కొడ్తామన్నారు.


పదేండ్లలో ఫామ్ హౌస్ లు ,అవినీతి కాళేశ్వరం కట్టుకోలేదా?  రాష్రాన్ని దోచుకుని పదవులు పంచుకున్నారు.  తెలుగు బిడ్డ పీవీని ప్రధానిని చేసింది సోనియా కాదా?   తెలంగాణను కాపాడేది మేమే..తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేమే.   తెలగాన తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న పెడ్తాం. త్యాగం అంటే సోనియా గాంధీది..వీళ్లు చేసిన త్యాగం ఏంటి.  కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపు కోసం  వెళ్లని నీచులు . రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తాం.  త్యాగం అంటే ఏంటో భావి తరాలకు గుర్తు చేయాల్సిన బాద్యత మనపై ఉంది.  గాంధీ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత అవినీతి పరులకు లేదు.  వేల కోట్లు దోచుకున్నోళ్లు ఇపుడు మాట్లాడుతున్నారు.  వేల కోట్ల ఆస్తులే కాదు.. ప్రాణ త్యాగాలు చేసిన ఫ్యామిలీ రాజీవ్ కుటుంబానిది.   చిల్లర మాటలు మాట్లాడే వాళ్లు గాంధీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి.

స్వాతంత్య్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం నెహ్రూ ఫ్యామిలీది.  స్వాతంత్ర్యం కోసం జైల్లో మగ్గిన చరిత్ర నెహ్రూది.  నెహ్రూ నేతృత్వంలో సర్దార్ హోంమంత్రిగా నిచేశారు.  దేశ మొదటి ప్రధానమంత్రిగా దేశాన్ని  ఐక్యంగా నడిపించారు. ఇది రాజకీయ వేదిక కాదు కానీ.. కొందర చిల్లరగా మాట్లాడుతున్నారు.  నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరా ఒక్క పదవి తీసుకోలేదు.  ఇందిరమ్మ మరణం తర్వాతే రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చారు.  కొందరు సన్నాసులు  పదే పదే కుటుంబరాజకీయాల గురించి  మాట్లాుతున్నారు.తండ్రులను అడ్డం పెట్టుకుని పదవులు  అనుభవించారు. దేశంలో కాదు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టింది నెహ్రూనే ఎన్ని వరదలు వచ్చినా ప్రాజెక్టులు నిలబడ్డాయి. నెహ్రూ దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్ కట్టింది నెహ్రూనే. ఎడ్యుకేషన్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు..25 లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములను రాష్ట్రంలో పంచింది కాంగ్రెస్.  లంబాడీలను ఎస్టీల జాబితాలో చేర్చింది ఇందిరమ్మ కాదా?.  దేశం కోసం ఆఖరి  శ్వాస వరకు ఇందిరమ్మ కొట్లాడింది అని సీఎం రేవంత్ అన్నారు.