కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ లో జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నారాయణపేటలో  మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ను  రేవంత్ ప్రారంభించారు. మహిళలో ముఖాముఖీ మాట్లాడిన రేవంత్.. కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుతామని చెప్పారు.   మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు.

 ఇందిరా మహిళా శక్తిలో 67 లక్ష్లల  మంది ఉన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం.  కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం.  1000 మెగావాట్ల సోలార్ పవర్ ను మహిళా సంఘాలకు అప్పగించాం. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం. శిల్పారామం పక్కనే పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత ఎదగాలి.  గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలె. 1000 కోట్లతో మహిళా సమాఖ్య  సభ్యులకు  చీరలు ఇస్తాం. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఏడాదిలో రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం మామూలు  చీరలు ఇచ్చేది..మేం నాణ్యమైన చీరలు ఇస్తాం అని రేవంత్ అన్నారు. 

ALSO READ | ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీజేపీ మాత్రమే పోటీ చేస్తోంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్ర,కేంద్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు..మిగతా టైంలో అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి.  నియోజకవర్గానికి ఒక్కటైన మహిళా సమాఖ్యకు పెట్రోల్ బంక్ ఇస్తాం.  కోటి మంది మహిళలతో  ఓఆర్ఆర్ దగ్గర భారీ ప్రదర్శన చేద్దాం రండి అని రేవంత్ పిలుపునిచ్చారు.