
కేటీఆర్ను అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డుకుంటోందని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ సభలో మాట్లాడిన రేవంత్.. కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ మాట్లాడుతున్నారని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్టును అడ్డుకుంటున్నది బీజేపీనేనని అన్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లను విదేశాల నుంచి రప్పిస్తే.. 24 గంటల్లోనే కేటీఆర్ ను అరెస్టు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు:
కేటీఆర్ ను అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డుకుంటోంది
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోంది
కేటీఆర్ అరెస్టు కాకుండా చూస్తున్నందుకు బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోంది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదు
ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్లు ఉపఎన్నికల్లో గెలుస్తామంటున్నారు
పదేళ్లలో రాని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయి
2021లో కుల గణన, జనగణన ఎందుకు చేయలే బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలి
కులగణన చేసి వందేళ్ల సమస్యను ఏడాదిలోనే పరిష్కరించా
మా లెక్కలు తప్పని సొల్లు వాగుడు వాగుతున్నారు.
కేసీఆర్ సర్వేలో బీసీలు 51 శాతం వచ్చారు
మేము చేసిన సర్వేలో 56 శాతానికి పైగా బీసీలు
మా సర్వే కరెక్టా.. కేసీఆర్ సర్వే కరెక్టా చెప్పాలి..