
గనుల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇసుక, ఇతర గనుల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు. ఇక నుంచి ఇసుక సరఫరా TGMDC ద్వారానే చేయాలని ఆదేశించారు.
ఇసుక రీచ్ లలో తవ్వకాలు, రవాణా, తక్కువ ధరకు ఇసుక సరఫరాపై విధివిధానాలు అధికారులకు సూచించారు. సిటీకి మూడు వైపులా ఇసుక స్టాక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి పారుదల, ఆర్ అండ్ బీ ఇతర ఏ పనులకైనా TGMDC ద్వారానే ఇసుక సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.
చాలా కాలంగా పెండింగ్ లో మైనర్ ఖనిజాల గనుల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ సూచించారు.