
ఎస్సీ వర్గీకరణ అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ సభలో మాట్లాడిన సీఎం.. పీఎం మోదీ హైదరాబాద్ వచ్చి మందకృష్ణ మాదిగను కౌగిలించుకుంటారని, కానీ వర్గీకరణ మాత్రం చేయరని విమర్శించారు. తాము వర్గీకరణపై అసెంబ్లీ తీర్మానం చేసి ఆమోదింపజేశామని గుర్తు చేశారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై సంచలన వ్యాఖ్యలు:
హైదరాబాద్ మెట్రోకు అనుమతి రాకుండా కేంద్రంపై కిషన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు
మూసీ ప్రక్షాళనకు నిధులు రాకుండా అడ్డుకున్నారు
మాకు క్రెడిట్ వస్తదని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
పట్టభద్రులు అండగా నిలబదండి.. కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా
కేటీఆర్ ను అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డుకుంటోంది
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోంది
కేటీఆర్ అరెస్టు కాకుండా చూస్తున్నందుకు బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తోంది
ఈ కార్ రేసులో కేటీఆర్ ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు..
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎప్పుడు విదేశాల నుండి రప్పిస్తారు.
బండి సంజయ్ శాఖ పనే కదా ఇది..?
వారు రాగానే బొక్కలో వేస్తాం..
వారితో చీకటి ఒప్పందాలు చేసుకుని కాపాడుతున్నారు
కాగితాలు ఇచ్చి డ్రామాలు చేస్తున్నారు
Also Read:-హైదరాబాద్లోని ఈ మండీలో వారం నుంచి ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ను వండి వడ్డిస్తున్నారు..!