
తెలంగాణలో డ్రగ్స్, గంజాయి నివారణకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి కరెంటు, నీళ్లు కట్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ విషయంలో ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
ఫాంహౌస్ లలో డ్రగ్స్ పార్టీలపై దాడులు చేస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్.. ఈ విషయంలో ఎంతటివారున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ALSO READ | మేం చేసిన అప్పు రూ.లక్షా 58 వేల కోట్లు.. అసెంబ్లీలో అప్పులపై సీఎం రేవంత్ వివరణ
హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ కు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు సీఎం రేవంత్. పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను పెంచుతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా ఎలక్ట్రిక్ ఆటోలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. లాల్ దర్వాజా అభివృద్ధికీ రూ.20 కోట్లు కేటాయిస్తు్న్నట్లు తెలిపారు.