జపాన్లోని కితాక్యూషూ నగరంలో సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం

జపాన్లోని కితాక్యూషూ నగరంలో సీఎం రేవంత్ బృందానికి ఘన స్వాగతం

కితాక్యూషూ: జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కితాక్యూషూ మేయర్ను కలుసుకున్నారు. నగర మేయర్ కజుహిసా టకేచీ గారు తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మరియు అధికారులకు మేయర్ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యంతో ఉన్న నగరం కితక్యూషూ. గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.

రాష్ట్ర అభివృద్ధిలో మూసీ నది ప్రక్షాళన కీలకమని సీఎం రేవంత్​రెడ్డి జపాన్లోని టోక్యోలో జరిగిన ‘జపాన్​ తెలుగు సమాఖ్య’ సమావేశంలో చెప్పారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌లో సబర్మతి, వారణాసిలో గంగా, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ల స్ఫూర్తితో తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.

చెరువు మధ్యలో ఉన్న నిర్మాణాలను చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. వాటిని కూల్చకపోతే ప్రకృతి క్షమించదన్నారు. యూఎస్‌‌‌‌‌‌‌‌లో హడ్సన్, లండన్‌‌‌‌‌‌‌‌లో థేమ్స్, సియోల్‌‌‌‌‌‌‌‌లోని నదులను స్వయంగా చూసిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను పొల్యూషన్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలంటే  మూసీ నదిని కాలుష్య రహితంగా మార్చాలని తెలిపారు.

హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యో, లండన్‌‌తో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రవాస తెలుగువాళ్ల సహకారం, ఆలోచనలు కీలకమని, సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం అపూర్వమైందని సీఎం రేవంత్ రెడ్డి టోక్యోలో జరిగిన ‘జపాన్​ తెలుగు సమాఖ్య’ కార్యక్రమంలో ప్రసంగించారు.