తెలుగు వర్సిటీ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్

తెలుగు వర్సిటీ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్

జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ భవనాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇంత కాలం నాంపల్లిలో కొనసాగిన వర్సిటీని ఈ అకడమిక్ ఇయర్ నుంచి బాచుపల్లిలో నిర్వహిస్తున్నారు. సోమవారం యూనివర్సిటీ 39 వ్యవస్థాపక దినోత్సవం కావడంతో స్నాతకోత్సవాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి  సీఎం రేవంత్ హజరుకానున్నట్టు యూనివర్సీటీ నిర్వాహకులు తెలిపారు.