
- రెండు రోజుల ఏఐసీసీ కీలక సమావేశాలకు హాజరు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. అక్కడ మంగళ, బుధ వారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఏఐసీసీ కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 8. 30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు, పలువురు పార్టీ నేతలు శనివారం రాత్రే అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఈ సమావేశాల రెండో రోజున సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన విషయాన్ని, ఎస్సీ వర్గీకరణ బిల్లుపైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.