
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే నానుడిని ప్రభుత్వ ఆస్పత్రులు తిరగరాస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తీరుతారని ఆయన పోస్ట్ చేశారు. ఈ మధ్య ఏపీకి చెందిన హేమంత్ (22) అనే యువకుడికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే.
ప్రైవేటు ఆస్పత్రి అడ్మిట్ చేసుకోకుండా పంపించిన కేసును ఉస్మానియా వైద్యులు టేకప్ చేసి ప్రాణాలు కాపడారు. షిర్డీకి వెళ్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఏపీ యువకుడు హేమంత్ (22)కు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు ఉస్మానియా డాక్టర్లు. ఈ సర్జరీ సక్సెస్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రంగా అజ్మీరా, డాక్టర్ విక్రమ్ బృందాన్ని అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Also Read : భూ భారతితో సమస్యలు పరిష్కారం
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానాకు
— Revanth Reddy (@revanth_anumula) April 18, 2025
అన్న నానుడిని తిరగ రాసి…
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలచుకుంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని …
రుజువు చేసి…
ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో …
విశ్వాసాన్ని పెంచిన…
ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు …
డాక్టర్ రంగా అజ్మీరా,
డాక్టర్ విక్రమ్… pic.twitter.com/5RCviWd63c
ఈ సందర్భంగా అప్పట్లో ప్రభుత్వ ఆస్పత్రులపై ఉన్న అభిప్రాయంతో రాసిన‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అనే జానపద గేయాన్ని ఉదహరిస్తూ.. ఆ నానుడిని తిరగరాశారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవ చేస్తున్న ప్రతి వైద్యుడు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు సీఎం రేవంత్.