కేంద్ర సర్కార్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర సర్కార్  రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  సంవిధాన్ బచావ్ ర్యాలీలో పాల్గొనేందుకు ఇండోర్ వెళ్లారు రేవంత్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాజ్యాంగాన్ని రక్షించడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.అంబేద్కర్ ను కావాలనే బీజేపీ పదే పదే అవమానిస్తోందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం రక్షణకే సంవిధాన్ బచావో ర్యాలీ చేపడుతున్నామని చెప్పారు.  ఖర్గే,రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీపై పోరాటం చేస్తుందని చెప్పారు.

జనవరి 27న మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా  మౌ కంటోమన్మెంట్ లో ఆలిండియా కాంగ్రెస్   జై బాబు,జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.  తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ,పలువురు మంత్రులు   పాల్గొననున్నారు. అంబేద్కర్  సొంతూరు మౌ కంటోన్మెంట్ లో కాసేపట్లో  ఈ ర్యాలీ జరగనుంది.  కేంద్రం రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సంవిధాన్ ర్యాలీ చేపడుతున్నారు.