టాలీవుడ్, బాలీవుడ్ కాదు.. ప్రభాస్ది హాలీవుడ్ రేంజ్ : సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్, బాలీవుడ్ కాదు.. ప్రభాస్ది హాలీవుడ్ రేంజ్   : సీఎం రేవంత్ రెడ్డి

క్షత్రియులు విజయానికి,నమ్మకానికి  మారుపేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  కష్టపడే గుణం వల్ల వాళ్లు ఎక్కడైనా విజయం సాధిస్తారని చెప్పారు.  గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో సీఎం  రేవంత్ కు అభినందన  సభ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. క్షత్రియులు అన్ని రంగాల్లో అధ్బుతంగా రాణించారని చెప్పారు. కృష్ణం రాజు, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు సినీ రంగంలో రాణించారని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని అన్నారు.  ఇవాళ టాలీవుడ్, బాలీవుడ్ కాదు    హాలీవుడ్ రేంజ్ బాహుబలిని  ప్రభాస్ లేకుండా ఊహించలేమన్నారు.  ఇదంతా వారి శ్రమ వల్లే సాధ్యమైందన్నారు.

మీడియా లో టాప్ ఛానెల్స్ ను ప్రారంభించింది కూడా ఆనాడు రాజులేనన్నారు సీఎం రేవంత్. ఇప్పటికీ నిజాం షుగర్ సంస్థ రాజుల చేతిలో ఉందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. బోస్ రాజు, భూపతి శ్రీనివాస రాజులు ఇద్దరు లాయల్టీ ఉన్న వ్యక్తులు కాబట్టే వాళ్లకు పదవులు వచ్చాయి.. బోస్ రాజును రాహుల్ గాంధీ, శ్రీనివాస రాజుని మోదీ. ..ఈ ఇద్దరిని నాయకులుగా జనాల్లో ఉంచారని చెప్పారు. యుంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది..దానికి  కో చైర్మన్ గా శ్రీనివాస రాజుని నియమించామన్నారు రేవంత్.

 హైదరాబాద్లో  క్షత్రియ భవనానికి కావాల్సిన భూమి,అనుమతులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ అభివృద్ధికి ఎందరో క్షత్రియ నేతలు కృషి చేశారని చెప్పారు. క్షత్రియులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన ఉందన్నారు రేవంత్.  హైదరాబాద్ అభివృద్ధిలో   క్షత్రియులు భాగస్వామ్యులేనన్నారు రేవంత్. అల్లూరి,కొమురం భీం స్పూర్తితో తాము ముందుకెళ్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో క్షత్రియులు పెట్టుబడులు పెట్టాలని కోరారు.  రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.