నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘన కేసులో  కోర్టుకు హాజరయ్యారు రేవంత్. రేవంత్ రెడ్డిపై నల్గొండ, బేగంబజార్,మెదక్ జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా రేవంత్ ఫిబ్రవరి 20న  నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి పై ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నమోదు చేసిందన్నారు న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ ఛైర్మన్ తిరుపతి వర్మ. తదుపరి విచారణను  నాంపల్లి కోర్టు  మార్చి 23 కు కోర్టు వాయిదా వేసింది.

మరో వైపు సీఎం రేవంత్ నాంపల్లి కోర్టుకు హాజరవ్వడంతో కోర్టు పరిధిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.