నా కోసం ఓ పేజీని రాసుకోవాల్సి వస్తే.. ఈ రోజును రాసుకుంటా: సీఎం రేవంత్

నా కోసం ఓ పేజీని రాసుకోవాల్సి వస్తే.. ఈ రోజును రాసుకుంటా: సీఎం రేవంత్

ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ను   సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో  ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్...  వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కమిషన్ కు  ప్రజలు  4750 ఆర్జీలు ఇచ్చారని చెప్పారు. 59  కులాల ఆర్థిక, రాజకీయ అంశాలపై  కమిషన్ ఆరాతీసిందన్నారు. 82 రోజుల్లోనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసిందని తెలిపారు సీఎం రేవంత్. 

 గ్రూప్ 1లో సామాజికంగా వెనుకబడ్డ 15 కులాలను చేర్చింది.  గ్రూప్ 1లో  ఉన్న కులాలకు ఒక శాతం రిజర్వేషన్లు.. గ్రూప్ 2లో 18 కులాలకు 9 శాతం. . గ్రూప్ 3లో 26 కులాలు ఉన్నాయి వీరికి 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసింది.  గ్రూప్ 1లో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 2,3లో భర్తీ చేయాలి.  ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ పెట్టాలన్న కమిషన్ సిఫారసును ప్రభుత్వం తిరస్కరించింది. సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన రోజే ప్రకటన చేశా..వర్గీకరణను అమలు చేస్తాం.  అన్ని రాష్ట్రాల కంటే ముందే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ  ప్రభుత్వం కట్టుబడి ఉంది అని సీఎం రేవంత్ అన్నారు.

ALSO READ | కులగణనకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

 ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి.ప్రాణాలు పోయాయి. కులగణన,ఎస్సీ వర్గీకరణ తీర్మాణాలను సభలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసే  అవకాశం నాకు  వచ్చింది. గతంలో ఏ ముఖ్యమంత్రికి రానీ అవకాశం నాకు వచ్చింది.   నా రాజకీయ జీవితంలో  ఇదో గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయంతో నా రాజకీయ జీవితానికి పరిపూర్ణత వచ్చింది. నా కోసం ఓ పేజీని రాసుకోవాల్సి వస్తే ఈ రోజును  రాసుకుంటా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో న్యాయమూర్తులను పెట్టాం అని సీఎం రేవంత్ అన్నారు.