ఒకే రోజు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ టూర్.. షెడ్యూల్ రిలీజ్

ఒకే రోజు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ టూర్.. షెడ్యూల్ రిలీజ్

 ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ . కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని  దక్కించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే  సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 24న  సీఎం రేవంత్ నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించున్నారు. రేవంత్ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ అయ్యింది.

ALSO READ | ఓటమి భయంతోనే రేవంత్ ప్రచారానికి వస్తున్నరు : బండి సంజయ్

రేవంత్ షెడ్యూల్

  • ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్  బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి నిజామాబాద్ కు బయల్దేరతారు.11.45 నిమిషాలకు అక్కడ ల్యాండ్ అవుతారు. 11.50 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటలకు బహిరంగ సభలో మాట్లాడతారు 
  • ఫిబ్రవరి 24న  మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు మంచిర్యాలకు చేరుకుంటారు. 2.20 గంటల నుంచి 3.55 గంటల వరకు  సభలో పాల్గొంటారు
  • ఫిబ్రవరి 24న సాయంత్రం 4.20 గంటలకు  కరీంనగర్ కు చేరుకుంటారు . కరీంనగర్లోని బహిరంగ సభలో 4.25 గంటల నుంచి 5.50 గంటల వరకు మాట్లాడతారు
  • మళ్లీ  హెలికాప్టర్ ద్వారా  సాయంత్రం 6 గంటలకు  సీఎం రేవంత్ హైదరాబాద్ బయల్దేరతారు.