కేసీఆర్ చెల్లని రూపాయి..కేటీఆర్ ఓ పిచ్చోడు: సీఎం రేవంత్

కేసీఆర్ చెల్లని రూపాయి..కేటీఆర్ ఓ పిచ్చోడు: సీఎం రేవంత్

కేసీఆర్ చెల్లని రూపాయిలాంటోడు.. ఆయన గురించి ఎందుకు మాట్లాడటం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఓ పిచ్చోడు.. ఏదేదో మాట్లాడతారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో చిట్ చాట్ లో  మాట్లాడిన రేవంత్.. ప్రాజెక్టుల మీద లోన్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు.  ప్రాజెక్టులన్ని బడ్జెట్ పరిమితిలో ఉంటాయన్నారు. కేంద్రాన్ని నిధులు అడుగుతున్నామని..కిషన్ రెడ్డి నిధులు తేవడం లేదన్నారు. 

రింగ్ ఉంటేనే రింగ్ రొడ్డు అంటారు..సగం చేసి రింగ్ రొడ్డని కిషన్ రెడ్డి అంటారు.  మోదీ రీజినల్ రింగ్ రోడ్డు ఇస్తున్నాం అన్నారు..మరి ఎక్కడ ఉంది.జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రోనే ఇంకా ఉంది కిషన్ రెడ్డి మెట్రో ఎక్కడ ఉంది.ట్రిపుల్ ఆర్ పూర్తి చేయాల్సిన భాద్యత కేంద్రానిదే. బట్టి విక్రమార్క పిలిస్తే బిజేపీ నాయకులు ఎందుకు డుమ్మా కొట్టారు.  కేంద్ర మంత్రి మనోహర్ కటర్ సమావేశానికి కిషన్ రెడ్డి ఎందుకు రాలేదు. 

తెలంగాణతో బీఅర్ఎస్ వాళ్లకు ఎం సంబంధం అందుకే బట్టి సమావేశానికి రాలేదు. బీఆర్ఎస్ ఏ ఎన్నిల్లో పోటీ చేయడం లేదు.  ఎడ్యుకేషన్ సెస్ కడుతున్నాం రిటర్న్ ఒక పైసా ఇస్తున్నారా?  కేంద్రానికి కట్టే పన్ను ఎంత.? రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఎంత.. లెక్కలు తీద్దాం. కేంద్రం చెప్పేవి నిజం అని తేలితే...బట్టి నేను కలిసి సన్మానం చేస్తాం అని సీఎం రేవంత్ అన్నారు.