అసెంబ్లీలో భూభారతిపై చర్చ సందర్బంగా కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. లోపభూయిష్టంగా ఉన్న ధరణితో సమాచారాన్ని దేశం దాటించారని ఆరోపించారు. ILFS టెరాసిన్ అనే కంపెనీకి ధరణి టెండర్లు ఇచ్చారని చెప్పారు. ఈ టెరాసిన్ కంపెనీని ఫిలిప్పీన్ కు చెందిన మరో కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. రకరకాల కంపెనీలు ఇందులో వాటా తీసుకున్నాయని ఆరోపించారు. ఒక శాతం వాటా ఉన్న గాదె శ్రీధర్ రాజు, రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ సీఈవో అయ్యారని చెప్పారు.గాదె శ్రీధర్ రాజు సమాచారాన్ని విదేశాలకు పంపారని ఆరోపించారు. వాళ్లు ఒక్క క్లిక్ కొడితే సమాచారం మొత్తం పోతుందన్నారు రేవంత్.
NIC కి టెరాసిన్ కంపెనీ సహకరించడం లేదన్నారు రేవంత్ . కందుకూర్ తిమ్మాపూర్ భూదాన్ భూములను అమ్మేశారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా కూడా భూమిని బదలాయించారని చెప్పారు. భూభారతి తీసుకొస్తే నేరం బయట పడుతుందని చర్చను అడ్డుకోవాలని చూశారని అన్నారు. ధరణితో కేసీఆర్ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని..కేసీఆర్ చేసిన నేరాలకు ఏ శిక్ష వేయాలో తెలియడం లేదన్నారు రేవంత్ రెడ్డి. భూభారతి గురించి మాట్లాడితే బీఆర్ఎస్ భండారం బయట పడుతుందన్నారు రేవంత్.