పదేళ్ల పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు తప్ప పేదల ఇళ్లను పట్టించుకోలే: సీఎం రేవంత్ రెడ్డి

గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  16 వేలకోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే.. పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు ..సెక్రటేరియట్ లో ఇందిరమ్మ ఇళ్ల యాప్  ప్రారంభోత్సవంలో  రేవంత్  మాట్లాడారు. ఈ సందర్బంగా.. బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్లలో  33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు .. ఫాంహౌస్ లు పూర్తి చేసుకున్నారే తప్ప పేదల ఇళ్ల నిర్మాణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ పేదలకు ఇళ్లు కాకుండా  బెల్టు షాపులు పెట్టించారని ఆరోపించారు.  

ALSO READ | గుడ్ న్యూస్ : ఫస్ట్ వాళ్లకే ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు ఎప్పుడిస్తారంటే.?

గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో 60 వేల నుంచి 65 వేల ఇండ్లను మాత్రమే కట్టారని చెప్పారు రేవంత్ . ప్రతిపక్ష పార్టీలు అంటే  శత్రువులన్నట్టుగా కేసీఆర్ క్రియేట్ చేశారని విమర్శించారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు కాదు.. 119 సభ్యులని చెప్పారు. కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు రేవంత్.  కేసీఆర్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలన్నారు. 

రేవంత్ కామెంట్స్

  •  ఆదివాసులకు అదనంగా ఇళ్లు కేటాయిస్తాం
  • ప్రతి ఒక్కరికి కూడు,గూడు ,గుడ్డ అవసరమని ఆనాడే ఇందిరమ్మ గుర్తించారు
  •  గిరిజన,దళితులకు, ఆదివాసులకు  ఇందిరమ్మ భూమి పంపిణీ చేశారు.
  • ఏ గ్రామానికి వెల్లి చూసినా ఇందిరమ్మ ఇచ్చిన భూమే కనిపిస్తుంది
  •   భూమిలేని పేదలకు భూమి ఇచ్చి హక్కులను  కల్పించారు.
  • గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ..ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు
  • దివంగత వైఎస్సార్ ఇందిరమ్మ ఇండ్లకు  రూ. లక్షా 20 వేలు ఇచ్చారు
  •  ప్రస్తుతం పెరిగిన  ధరలకు అనుగుణంగా రూ. 5 లక్షలు ఇస్తున్నారు. 
  • ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రతి ఒక్కరి కల
  •  ఒక్క తెలంగాణలోనే 35 లక్షల  భూపంపిణీ చేశారు
  • అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ద్వారా భూ హక్కులు కల్పించారు.
  •  కేసీఆర్ రద్దు చేసిన హౌసింగ్ శాఖను  పునరుద్ధరించాం
  • పేదలకు ఇవాళ నిజమైన పండుగ
  • లబ్ధిదారుల ఎంపిక పారదదర్శకంగా జరగాలనే యాప్ తీసుకొచ్చాం
  •  కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం
  •   దాదాపు 4లక్షల మంది లబ్ధిదారులకు రూ. 5 లక్షలు ఇస్తాం
  •  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తాం
  •  ఇందిరమ్మ ఇళ్ల  లబ్ధిదారుల ఎంపికలో నిభందనలు సడలించాం
  •   ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా కొన్ని వేల ఇండ్లు ఇస్తాం
  •  గోండుల,ఆదివాసులకు అదనంగా ఇళ్లు కట్టిస్తాం
  • గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఇళ్లను  పూర్తి చేస్తాం
  •  బీఆర్ఎస్ హయాంలో  60 నుంచి 65 వేల ఇండ్లు పూర్తయ్యాయి
  •  పెండింగ్ ఇండ్ల కోసం రూ. 190 కోట్లు కేటాయించాం
  •  బీఆర్ఎస్ నేతలు కోట్లు ఖర్చు పెట్టి 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు పూర్తి చేసుకున్నారు
  • ఫాంహౌస్ లు,  కార్యాలయాలు పూర్తి చేసుకున్నారు తప్ప పేదల ఇళ్లను పట్టించుకోలేదు
  •  బస్తీ, బస్తీల్లో కేసీఆర్ బెల్టు షాపులు ఓెపెన్ చేయించారు
  •  16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్  రాష్ట్రాన్ని ఇస్తే.. 7 లక్షల కోట్ల అప్పులతో మాకు  అప్పచెప్పారు
  •  అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చారే తప్ప పేదల ఇళ్లు పూర్తి చేయలేదు
  •  వేల ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మేశారు
  • 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇండ్లు కట్టించింది
  • పదేండ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు
  • అప్పులు,మిత్తీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది