అక్టోబర్ 6న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.!

 సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 6న ఢిల్లీకి వెళ్లనున్నారు. వరద నష్టంపై  కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సమగ్ర నివేదిక అందించనున్నారు.  అనంతరం  కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో  రాష్ట్ర హోంమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశం తర్వాత కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణలో  సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు  వరదలు రావడంతో  రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది.  కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది.  తక్షణ సాయం కింద తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 3300 కోట్లు రిలీజ్ చేసింది. మళ్లీ ఇటీవల  కేంద్రం 14 రాష్ట్రాలకు  5వేల 858కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది.  అందులో తెలంగాణకు కేవలం వరద సాయం కింద రూ. 416. 80కోట్లు  విడుదల చేసింది. కేంద్రం తెలంగాణకు అరకొర వరద సాయం ప్రకటించడంతో  సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లనున్నారు.