హైదరాబాద్: నాలుగు రోజులు నాన్ స్టాప్‌గా కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునగగా.. మరి కొన్ని ఏరియాలు జల దిగ్భందం అయ్యాయి. నాన్ స్టాప్ వర్షంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరద బీభత్సానికి దాదాపు 20 మందికి పైగా మృతి చెందారు. భారీగా పంట నష్టం జరిగింది. భారీ వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం కావడంతో ప్రజల్లో భరోసానింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
వర్షం, వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా వర్షం, వరదలతో వణికిపోయిన ఖమ్మం జిల్లాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మున్నేరు వాగు ఉగ్రరూపానికి గురైన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Also Read :- యువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
‘‘గుండె కరిగిపోయే దృశ్యాలు.. మనసు చెదిరిపోయే కష్టాలు.. స్వయంగా చూశాను. బాధితుల మొఖాలలో.. ఒకవైపు తీరని ఆవేదన.. మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా. వీళ్ల కష్టం తీర్చడానికి.. కన్నీళ్లు తుడవడానికి.. ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధం’’ అని ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా వరద బాధితుల ఇళ్లను పరామర్శించిన వీడియోను జత చేశారు.
గుండె కరిగిపోయే దృశ్యాలు…
— Revanth Reddy (@revanth_anumula) September 3, 2024
మనసు చెదిరిపోయే కష్టాలు…
స్వయంగా చూశాను.
బాధితుల మొఖాలలో …
ఒకవైపు తీరని ఆవేదన…
మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా.
వీళ్ల కష్టం తీర్చడానికి…
కన్నీళ్లు తుడవడానికి…
ఎంతటి సాయమైనా
చేయడానికి సర్కారు సిద్ధం.#TelanganaRains2024 pic.twitter.com/0NQPobJsd5