సీఎం రేవంత్ జపాన్ టూర్‎తో రాష్ట్ర నిరుద్యోగులకు మేలు: చనగాని దయాకర్

సీఎం రేవంత్ జపాన్ టూర్‎తో రాష్ట్ర నిరుద్యోగులకు మేలు: చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్  తెలంగాణ నిరుద్యోగ యువతకు వరంగా మారిందని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం జపాన్ టూర్ వల్ల ఇక్కడి యువతకు 30 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. 

ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఒక్క ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ పూర్తయిందని, త్వరలో మరో 20 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. హైదరాబాద్ లో ఎకో టౌన్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని..ఇప్పుడు మాత్రం దోచుకున్న సొమ్ముతో రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి హంగూ, ఆర్భాటాలతో పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకుంటుందని దయాకర్ విమర్శించారు.