మూసీ పునర్జీవనంపై.. హైదరాబాద్ ప్రజల భవిష్యత్‌పై.. మూసీ వల్ల నల్గొండ జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై.. చర్చించేందుకే ముందుకు రావాలని ప్రతిపక్షాలకు కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సూచనలు, సలహాలను అసెంబ్లీలోనే చర్చిద్దాం అని.. మాట్లాడుకుందాం అని.. దీని కోసం సిద్ధంగా ఉన్నట్లు.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
అక్కడా ఇక్కడా కాదని.. ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడుకుందాం అన్నారాయన. అసెంబ్లీలోకి ఆయా పార్టీల ఎంపీలు వచ్చి మాట్లాడేందుకు అవకాశం ఉంటే.. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. నా ఓపెన్ ఆఫర్‌కు సిద్ధమా అని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
ALSO READ | మూసీ టెండర్ అగ్రిమెంట్ రూ.141 కోట్లు మాత్రమే: సీఎం రేవంత్ రెడ్డి
మూసీపై రాద్దాంతం చేస్తున్న వాళ్లు మూసీ పక్కన మూడు నెలలు అయినా ఉండగలరా అని ప్రశ్నిస్తూనే.. అలా ఉంటే ఆ కిరాయి డబ్బులు నేనే కడతానంటూ కేటీఆర్, ఇతర నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.